| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| శాప విముక్తయై దేవకన్యయైన మొసలి | ||
| సీ. |
మడుగుఁ లోపలఁ జొచ్చి కడుపార నుదకంబు-గ్రోలంగ దిగ నందుఁ గ్రాలు మొసలి పాదముల్ కబళించి పట్టినఁ జరణముల్-విదళింపఁ బట్టూని విడవకున్న గడుసూక్ష్మరూపుఁడై కడుపులోపలఁ జొచ్చి-వేగంబ భేదించి వెడలె నంత నది దేవకన్యయై యాకాశముననుండి-తనదు వృత్తాంత మంతయును జెప్పి |
|
| తే. |
వీఁడు దైత్యుండు నమ్మకు వీనిఁ జంపి-పొమ్ము సంజీవికొండకుఁ బ్రొద్దు గలుగ నీకతంబున శాపంబు నాకుఁ దీఱె-ననుచు దీవించి చనియెఁ దా నమరపురికి. |
74 |
| వ. | అంత హనుమంతుడు తేజోవంతుండై యరుగుదెంచి కపటసంయమినిం గనిన నతండిట్లనియె. | 75 |