| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| కాలనేమి కపటోపాయము | ||
| సీ. |
దనుజేశుఁ డావార్త విని కాలనేమిగే-హము సొచ్చి నడిరేయి యతనితోడఁ తనచేత హతుఁ డైన ధరణీశు తమ్ముని-ప్రాణంబు లెత్తంగఁ బవనసుతుఁడు సనుచున్న యట్టిపని విఘ్న మొనరింపఁ-గ్రక్కున నటఁ బోయి ర మ్మటన్నఁ గాలనేమి యిదేటి కార్యంబు తగ దన్న-వినక కోపించిన వేగ నరిగి |
|
| తే. |
ద్రోణ శైలంబు చేరువత్రోవయందు-వనముఁ గావించి తగ మునీశ్వరునిరీతి జపము సేయుచుఁ గన్నులు చక్కమూసి-నడుము నిక్కించి పద్మాసనమున నుండె. |
66 |
| వ. |
అప్పు డాకాశమార్గంబునఁ జనుచున్నయప్పవనసుతుండు వనంబుగాంచి త్రోవ దప్పె నని మనంబున సందియ మొంది యమ్మునీంద్రు నడిగి చనువాఁడై యతనికి నమస్కరించి యిట్లనియె. |
67 |
| తే. |
మునినాథ! నేను రాముని పనికై చనుచున్న వాడఁ బరమౌషధముల్ గొని రావలె మది భావిం చి నిజమ్ముగ నిపుడు త్రోవ సెప్పుము నాకున్. |
68 |
| వ. | అని ప్రార్థించి దాహోపశమనంబున కుదకంబు వేఁడిన నక్కపట మునీంద్రుం డిట్లనియె. | 69 |
| ఆ. |
పవనతనయ! రామభద్రునిపని మాకుఁ దీర్పవలయుఁ గాన నేర్పుతోడఁ బ్రాణరక్షకొఱకు ద్రోణాద్రి కరుగంగ వలదు వినుము నాదువనమునందు. |
70 |
| తే. |
ఘనతరం బైన సంజీవి కరణి మొదలు గాఁగ దివ్యౌషధంబులు గలవుగానఁ గొంచుఁ బోవచ్చుఁ గావునఁ గోరుపండ్లు తనివి దీఱంగఁ దిని నీళ్ళు త్రాగుమిచట. |
71 |
| వ. |
అని తనహస్తంబున నున్నవిషయుక్తం బైన కమండలూదకంబు చూపినం గని హనుమంతు డవి చాల వనిన నక్కపటమునీంద్రుండు క్రూరమకరావృతం బైన కమలాకరం బొకం డెఱింగించి పొమ్మనినఁ బవనాత్మజుండుసని. |
72 |
| క. |
విమలమకరందలుబ్ధ భ్రమరనికరపక్షపవనపరికంపితస త్కమనీయ కుముద కైరవ కమలంబులు గలుగుకొలనుఁ గనుఁగొని యచటన్. |
73 |