| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| సంజీవనికై హనుమ పయనము | ||
| క. |
ఈయన ప్రాణము లెత్తఁగ వాయుజ! యలనాఁటిమందు వడిఁ దేవలె నీ వీయెడ నచటికిఁ దడయక పోయి వెసన్ రమ్ము ప్రొద్దు పొడువక మునుపే. |
60 |
| వ. | అనిన భూకాంతుండు హనుమంతున కిట్లనియె. | 61 |
| క. |
రమ్మా వాయుతనూభవ! యిమ్మహి సత్కీర్తిఁ బడయు మీతని ప్రాణం బిమ్ముగ రక్షింపుము నా తమ్ములలో నీవు నొక్కతమ్ముఁడ వరయున్. |
62 |
| వ. | అని డాయం జని కౌఁగిటం జేర్చి దీవించి యంపె నప్పుడు. | 63 |
| ఆ. |
పదము లూనఁ ద్రొక్కి వదనంబు దిగఁ జూచి చేతు లూని నడుము చిక్కఁబట్టి క్రుంగి నిక్కి యెగసి కుప్పించి వడి దాఁటి చనియె గగనవీధి ననిలసుతుఁడు. |
64 |
| వ. | అట్టి సమయంబున. | 65 |