| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| రావణుని సమర సంరంభము | ||
| క. |
శిరముల వీనుల గళములఁ గరముల నురమున నడుమున గమనీయపదాం బురుహముల భూషణావళు లరుదారఁగఁ దాల్చి మోహనాకృతి మీఱన్. |
21 |
| తే. |
గంధమాల్యాంబరాదులు బంధురముగ మేనఁ గలయంగ ధరియించి దానవేంద్రుఁ డంత రణభేరి వ్రేయించి పంత మలర బిరుదు రాహుత్తవీరులఁ బిలువఁ బనిచె. |
22 |
| వ. | అట్టి యవసరంబున. | 23 |
| ఆ. |
రోష మడర ఖడ్గరోముండు వృశ్చిక రోముఁ డల్ల సర్పరోముఁ డగ్ని వర్ణుఁడాది గాఁగ వచ్చిరి రాక్షస వీరు లపుడు దనుజవిభునిఁ గొలువ. |
24 |
| క. |
ఇరువది చేతులశస్త్రో త్కరములు మెఱయంగఁ దాల్చి కౌతుక మడరన్ దురగములు నూఱు గట్టిన యరదముపైఁ గూరుచుండ నతివిభవమునన్. |
25 |
| సీ. |
భేరులు తమ్మటల్ పెల్లు నిస్సాణముల్-బూరగొమ్ములు కంచువీరణములు మకిలక్రోవులు వీరమద్దెలల్ గిడుగిళ్ళు-పేరైనతప్పెటల్ పిల్లఁగ్రోళ్ళు తారలు చిమ్మటతారలు శంఖముల్-కాహళాల్ పసిడిఁఢక్కలును బిడులు గాలిగొమ్ములు డోళ్ళుకైవళ్ళు రుంజలు-ఛత్రసంఘంబులు చామరములు |
|
| తే. |
బోరుకలఁగంగ దిక్కులు బూరటిల్ల-దనుజవర్గంబు లిరువంకఁ దవిలి కొలువ వెడలె సన్నాహ మడరంగ వీరరవము-కరువు గట్టిన చందంబు గానఁబడఁగ. |
26 |
| క. |
కాలాగ్ని కాల భైరవ కాలాంతక కాలగండ కాలాహికళా భీల సముద్యద్దినకర కాలాకృతితోడఁ బంక్తికంఠుఁడు వెడలెన్. |
27 |
| వ. | ఇట్లుత్యుత్సాహంబుగా యుద్ధరంగంబునకు బయలుదేఱినసమయంబున. | 28 |