| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| హనుమంతునిచే ఖడ్గరోముని ఖండనము | ||
| ఆ. |
అంతఁ బంక్తి వదనునరదంబు నెదురుగా నడుచువాయుపుత్త్రునకును ఖడ్గ రోముఁ డనియె నతని రూపించి నా తోడ రణము సేయ వేగ రమ్మటంచు. |
35 |
| చ. |
పిలిచిన రోష మెత్తి కడు భీకరవృత్తిని ఖడ్గరోముతోఁ దలపడ వానిరోమములు దాఁకి శరీరము నొచ్చి యంతలో పల నొకపర్వతంబు గొని పావని దైత్యునిమీఁద నేయ ని శ్చలతను ఖడ్గరోముఁడును జక్కుగఁజేసినఁ దత్క్షణంబునన్. |
36 |
| చ. |
మఱియొక పర్వతంబు హనుమానుఁడు గైకొనివచ్చి క్రమ్మఱన్ మెఱవడిఁ ద్రిప్పి తద్రథముమీఁదను వైచిన వజ్రధారచేఁ బఱియలువాఱి ధాత్రిఁ బడుపర్వతమో యనఁ దేరితోడ ని ర్భరముగ ఖడ్గరోముఁడు సపాటగఁగూలె దురంబులోపలన్‌ఁ. |
37 |