| కీర్తనలు | క్షేత్రయ్య | అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల |
| మంగళకైశిక - చాపు |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల |
| చరణము(లు): |
| 'చిలుకల కొలికిరో! - చెలగు నీపైటలో - కురికేది యదియేమొ - తెలుపవే!' "అది కలికి జక్కవలంట - తెలియవో" 'అయితే సెలవియ్యవే పట్ట - జేరునో?' "అది పట్టరాదు బలుకొండలు" 'అయితే - ఎలనాగా? - పైనెక్కని - చ్చేన?' "ఒరి చిలుకల తేజివాని - చికిలి దుర్గములవి - తలపున నీవెక్క - దర మౌన? ఓరి!" అలల్ల .. |
| 'చక్కని పగడంపు - చాయల అది యేమేమో మ్రొక్కేను తెలుపవే ముదితరో!' "వన్నె కెక్కియున్న దొండపండది" 'అయితే - చొక్కచు మొనపంట - నొక్కనే' "అది నొక్కరాదు కెంపు - నిక్కము" 'ఎక్కువ వెలయిచ్చిన నిచ్చేనా?' "ఓరి! ఎక్కడ వెలలేని - చొక్కంపు మణి యిది దక్కించు కొననంట - తసికేవ? ఓరి!" అలల్ల.. |
| 'వినవే! నీ మొగమింత తళుకుమీఱి తనరేని అది యేమె?' "అది యనగ అద్దములంట తెలియవ?" 'అయితే - వనిత నీడ వచ్చునా?' "నీడ కానగరాదు కపురంపు తునకలు" 'అయితే నెనరుగ కలియ వచ్చేద?' "ఓరి! ఘనుడ! మువ్వగోపాల! నిను గూడి కలసేను - మునుపటి నెనరున - తనదేవ? ఓరి" అలల్ల.. |