| కీర్తనలు | క్షేత్రయ్య | ఎందుదాచుకొందు నిన్ను - నేమి సేతు నేను |
| కల్యాణి - రూపక |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| ఎందుదాచుకొందు నిన్ను - నేమి సేతు నేను |
| అను పల్లవి: |
| అందమైన నీ మోము - అయ్యారే ముద్దుగుల్కుచున్నది ఎందు.. |
| చరణము(లు): |
| అందిందు తిరుగకురా - అతివలు నీ తోడి పొందుగోరియే వేళ - పొగరుచున్నారు ఎందఱెందఱని కాతు - నెంతని నే విన్నవింతు పందెమాడు కొన్నారట! - పట్టుక పోయెద మనుచు ఎందు.. |
| పలుమాఱు నా సామి - బయటకు వెళ్ళకు మ్రొక్కెను నిలుపరాని మోహమున - నిన్ను జూచి చెలులు అలరు నీ మోవి తేనె - యూని చప్పరించవలసి కులుకు గుబ్బల ఱొమ్ము - గ్రుమ్మి పొయ్యెద మనుచు ఎందు.. |
| మదముతో నా ముద్దు - మువ్వగోపాల నా సామి గుదిగొన్న తమకమున - గూడి యిద్దరము నిదుర పరవశమున - వదలునో కౌగిళ్ళు పదిలముగ నా జడను - బట్టి కట్టుకొందునా ఎందు.. |