| కీర్తనలు | క్షేత్రయ్య | తెలిసి తెలియలేక - పలికేరు చెలులు |
| మధ్యమావతి - ఆది |
| (నాయిక: స్వీయ - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| తెలిసి తెలియలేక - పలికేరు చెలులు |
| అను పల్లవి: |
| కలిసియున్న నా సామిపై - గాక సేయ వశమా? తెలిసి.. |
| చరణము(లు): |
| చలయేటి తమ బు - ద్దులు వినలేదని యలిగి రేమి సేతు - నతివలెల్ల? చెలువుని ముద్దమా - టలు నా వీనుల నుండి తొలుకుచున్నవి తమ మా - టలకు చోటున్నదా? తెలిసి.. |
| కొనగంట దముగను - గొన దింతైనాగాని నెనరులేని దాయెనంచు - నిందించేరు ఘనమైన సామిరూపు - కనులు నిండియుండగ కనకాంగి! యితరులు - కానవత్తురటవే? తెలిసి.. |
| నా పాల గల మువ్వ - గోపాలసామితో కోపించుకొమ్మని - కొమ్మలనేరు ఏ ప్రొద్దు నా సామి - యెద నిండి యుండగ పాప మింతేగాని - కోపమున కిమ్మున్నదో? తెలిసి.. |