| కీర్తనలు | క్షేత్రయ్య | సామికి సరియెవ్వరే? నాచక్కని |
| ముఖారి - ఆది |
| (నాయిక: సామాన్య - స్వాధీనపతిక) |
| పల్లవి: |
| సామికి సరియెవ్వరే? నాచక్కని |
| అను పల్లవి: |
| భామరో! తిరువళ్ళూరి వీర రాఘవ! సామి.. |
| చరణము(లు): |
| నెలతరో! ఎప్పుడైన - నేనే చెక్కిలి జీరి కలగి యెరుక లేకయే - చెలియ జీరెనంట! తెలుసు కొమ్మనుగాని - యలగి మారు బలకక చలియించని నిండు కుండ - వలె నుండునమ్మ! సామి.. |
| కదసి నేనే వాని మోవి - గంటిచేసి మరపున పదిరి యీలాగుననే - పడతి యుంచె నందున! అదరిన? కోపగించిన? - అలసిన? సొలసిన? మదిరాక్షి! నాచిత్తము స - మ్మతి బరచునమ్మ సామి.. |
| భామరో మా మువ్వ గో - పాలుడౌ వీర రాఘవుడు కామకేళి హొయలుగ - గలసి యుండగ ఏమగువ వద్దనైన - ఈలాగుందువో యంటె ఈ మాటెట్లంటివని - ఎంతో యుస్సురనెనమ్మ! సామి.. |