| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 086. ఆశాబంధములు |
| 86. ఆశాబంధములు |
| తిరిగితి నెన్నో దేశముల బడి దొరకునొ చక్కని నెలవంచున్ |
| రాగము లెన్నొ హాయిగ బాడితి రక్తి దేన గల్గునొ యంచున్ |
| యెక్కితి నెన్నో పర్వతమ్ములన్ చుక్కల బట్టుదునో యంచున్ |
| వేవిధమ్ములౌ ప్రేమల సోలితి ప్రేమగుట్టు గాంతునో యంచున్ |
| ఇచ్చితి నెందరికో హృదయపు ధన మీవిపండు పండునో యంచున్ |
| ఎన్నోపూవుల పూజల సల్పితి నీశ్వరుకృప గల్గునొ యంచున్ |