| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 087. స్వాగతము |
| 87. స్వాగతము (మా మంగళప్రద జన్మకథ) |
| అమ్మా! ఓలోకమాత! కొమ్మా నాస్వాగతమ్ము! అమ్మా... |
| ఎల్ల జగమ్ముల నేలెడు తల్లి మా యింట చిట్టి పిల్లవుగా జన్మింపగ నుల్లమునన్ గోరి వచ్చి తమ్మా ఓ లోకమాత! కొమ్మా నా స్వాగతమ్ము! |
| సకల చరాచర ప్రపం చము లెల్ల జరించివచ్చి తల్లి! దయను నేటికి నా యిల్లు పావనమ్ము జేసి తమ్మా! ఓలోకమాత! కొమ్మా నాస్వాగతమ్ము! |
| నా తపమ్ము ఫలియించెను నా జన్మము ధన్యమయ్యె నో తల్లీ! నేటికి నీ వుదయ మౌట నా యింటను నమ్మా! ఓలోకమాత! కొమ్మా నా స్వాగతమ్ము! |