| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 088. దీపావళి |
| 88. దీపావళి (యమునా కల్యాణి - జంపె తాళం) |
| లోకాని కుత్తుత్త దీపావళీ నాకు మాత్రము దివ్య దీపావళీ! |
| వేదాల నాథుడౌ వేదాద్రి నరసింహ దేవుడే నా యింట దీపమైనాడు! లోకాని కుత్తుత్త దీపావళీ నాకు మాత్రము దివ్య దీపావళీ! |
| వేదవృక్షములాగు వేదాద్రి నీడ నా వంశ వృక్షమ్ము శా శ్వతముగా నిలవాలి! లోకాని కుత్తుత్త దీపావళీ నాకు మాత్రము దివ్య దీపావళీ! |