| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 089. జేజేలు |
| 89. జేజేలు |
| ఎవ్వ రను కున్నారొ ఎరగరా మీరు? పాపాయి సాక్షాత్తు పరమాత్ముడండి! |
| తరతరాలా గొప్ప తపసు జేశాము స్వామి నాటికినేడు వర మిచ్చినాడు! ఎవ్వ... |
| ఎన్నో యుగాలుగా విన్నవించాము ఇన్నాళ్ళ కీనాడు విన్నాడు మనవి! ఎవ్వ... |
| వేదాద్రినాథుడే వెలిసి నాయింట ఉయ్యాలతొట్టెలో ఊగుతున్నాడు! ఎవ్వ... |
| చేతులెత్తండోయి జేజే లనండోయ్ నరసింహదేవుడే నాచిట్టితండ్రోయ్ |
| ఎవ్వ రను కున్నారొ ఎరగరా మీరు? పాపాయి సాక్షాత్తు పరమాత్ముడండి! |