| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 090. పాపాయి లీలలు |
| 90. పాపాయి లీలలు (వాగేశ్వరీ రాగం - జంపె తాళం - ఖండజాతి) |
| దినదినము పాపణ్ణి దీవించి పొండీ దేవలోకములోని దేవతల్లారా! |
| నాపాప నిద్దట్లొ నవ్వుకుంటాడు ఆస్సెకాలాడేనొ అప్సరలతోను? దిన... |
| మా తండ్రి నిద్దట్లొ మాటాడుతాడు తెలియజెప్పేనేమొ దేవరాశ్శాలు? దిన... |
| కన్నయ్య నిద్దట్లొ కన్ను గిలికేను వెఱ్ఱిలోకముజూచి వెక్కిరించేనొ? దిన... |
| వాగీశ్వరీ ప్రేమరాగ మాలించి చిన్నయ్య బబ్బోర శ్రీరామరక్ష! దిన... |