| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 091. ఉపశాంతి |
| 91. ఉపశాంతి |
| వేదాద్రి శిఖరాన వెలిగేటిజోతి నా పూరిగుడిసెలో దీపమై వున్నె! స్వర్గ వుద్యానాల వాసించు పూవు నా మోటుచేతిలో నలిగిపోయేనె! |
| భూర్భువర్లోకాల బోయేటిపిట్ట కటిక నా కౌగిటికైదులో వున్నె! పరమాత్ముడౌ జగద్వ్యాపి పాపాయి ఇరుకు నా గుండెలో యిమిడిపోయేనె! |