| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 092. జీర్ణం జీర్ణం |
| 92. జీర్ణం జీర్ణం |
| వేదాద్రి శిఖరాన వెలిగిన్నజోతి మినుకు మని కాసేపు కునికిపోయింది! దేవలోకమునుంచి దిగినట్టి గంగ వచ్చిన్న దారినే పట్టి మళ్ళింది! |
| పంజరం దూరిన బంగారుపిట్ట తలపు దీ సేవేపొ తర్లిపోయింది! కాపుర మొచ్చిన కన్ని పాపాయి యిల్లుకాళీచేసి వెళ్ళిపోయాడు! |