| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 101. ఊరేగింపు |
| 101. ఊరేగింపు ఆర్. దాసు మరణమును గూర్చినది) |
| ఊరేగు మన్మథా ఊరేగవోయ్ పెండ్లి కొడుకూలాగు పల్లకీలో యెక్కి ఊరేగు... |
| వాసంతికాదేవి వన్నె తరిగున్నాది కీర్తికాంతల్లదిగొ కీగన్ను గీటేని ఊరేగు... |
| కిన్నరులు ఖేచరులు కింపురుషు లంతాను బాజాలు వాయిస్తు పల్లకితొ వచ్చేరు ఊరేగు... |
| వేదాంతివీ నీకు లేదూ రేపటిచింత నేడే శుభలగ్నమ్ము వేడుక చూడొచ్చినాము ఊరేగు... |
| ఊరేగు మన్మథా ఊరేగవోయ్ పెళ్ళికొడుకూలాగు పల్లకీలో యెక్కి ఊరేగు... (చిత్తరంజనుడన్నను, మన్మథుడన్నను ఇంచుమించొకటే) |