| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 102. యమునా స్వాంతనము |
| 102. యమునా స్వాంతనము ధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి మృతి) |
| ఏలా పాడే నింక యమునాకల్యాణి, నే లీలా మానవుడు గోపాలుడు లేడాయె? నేలా... |
| బంగారు గనులలో చెంగలించేవేళ పిడుగు బోలినవార్త వినిపించినా రయ్యొ ఏలా... |
| చెడువార్త వినగానె చెవులు గింగురుబోయె ఎంత చించుకొన్న గొంతు పెగలదాయె నేలా... |
| వెన్నెలకు తోడు మా వేణుగోపాలుడు కన్నుల పండువుగ కనిపించకుంటేనే నేలా... |
| ఈనాటి యీ నేస్త మే జన్మకో తిరిగి కన్నీళ్ళు గారవకె కడుపు చెఱువయ్యేనే |
| నేలా పాడే నింక యమునాకల్యాణి, మా లీలా మానవుడు గోపాలుడు లేడాయె? నేలా... |