| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 069. అవతార సమాప్తి |
| 69. అవతార సమాప్తి |
| నీవు నెమ్మది నుంటి వేముంది చెప్ప? నీవు మరణము నొంది తేముంది చేయ? నీయాత్మ యాపరమేశుసన్నిధిని జేరె నింకేముంది నేరుచుకొనగ? నీ వంత మొంద నాకీజీవ మేల? అర్థమ్ములేని వైభవము కీర్తియును కలిసి ముచ్చటలాడు చెలికాడు లేక వేచి చూడందగు విభునీడ లేక? |