| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 070. కాంచితి! కాంచితి! |
| 70. కాంచితి! కాంచితి! |
| కాంచితి కాంచితి భగవంతుని నా కన్నులార నేడు |
| కళ్యాణభాగ్య భాసమానయౌ కాంతరూపమున కన్నుల బడియెన్ పడతీ! పిల్లలు కలరా నీకని అడిగితి నేదయతోడన్ |
| పాపులయ్యు పశ్చాత్తాపము బడు ప్రణయనీ జనులె నాబిడ్డ లనెన్! మెలతా! జగతిని నీకెవ్వరైన మిత్రులు గలరా యంటిన్ |
| మిత్రులౌదు రనె ప్రపంచమందు ప విత్రవర్తనము గలవా రెల్లన్ అతివా నీ ప్రాణనాథు డెవడని యంటి నిలువలేక |
| ఆడుదానివలె హృదయము కానుక యర్పించినతడె నా నాథు డనెన్ కాంచితి కాంచితి భగవంతుని నా కన్నులార నేడు. |