| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 071. కవి జీవితము |
| 71. కవి జీవితము |
| కవి యని కీర్తిని గాంచుట కన్నను ఘన మే మున్నది జగతిన్? |
| కష్ట సుఖమ్ముల చవి జూచుటకన్న మృష్టాన్నం బెటు రుచిరా? |
| వలపుమంట మ్రిం గు కన్న హాలా హలము మ్రింగు టెటు గొప్పరా? |
| ప్రణయవేదనల పాడుట కన్నను పరమామోదం బెదిరా? |
| మృత్యు వైభవము కీర్తించుటకన్న నిత్యానందము కలదే? |
| ఆనందలోక మరయుట కన్నను కానని సౌఖ్యము కలదా? |
| సౌందర్యోపా సనమున కన్నను సద్వ్రత మెయ్యది చెపుమా? |
| భావిశాశ్వతము జీవించుకన్న జీవితఫల మిం కెదిరా? |