| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 115. భూదేవి |
| 115. భూదేవి |
| అమ్మా వో భూదేవీ! నమ్మితిమమ్మా నిన్నే! అమ్మా... |
| నీరు పేరు చెపితె గుండె నీరయిపోయే నమ్మా నిప్పు పేరు చెపితే ప్రాణి గుప్పునెగిరి పోనమ్మా! అమ్మా... |
| గాలి పేరు చెపితె మాకు కాలుసేతు లాడవమ్మ ఆకాశమ్మంటే మా కసలే భయ మౌనమ్మా! అమ్మా... |
| కొండకోనలయినగాని ఘోరారణ్యాలుగాని మేడలైనగాని చెట్ల నీడలే నెడారిగాని అమ్మా... |
| తల్లి పక్కలోన చిన్ని పిల్లలు బజ్జున్నలాగు నిన్ను నమ్మి నిబ్బరముగ నిద్దురబోయేమమ్మా! |
| అమ్మా వో భూదేవీ! నమ్మితిమమ్మా నిన్నే! |