| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 116. ప్రణయాంజలి |
| 116. ప్రణయాంజలి |
| ఇంతయప్పుడె యితరమ్ము నెఱుగనట్టి విమలమతి నిన్ను ప్రేమించి విఫలమొంది మరణమునకయి చూచుచు మ్రగ్గుచున్న స్నేహితుని ప్రణయాంజలిం జేకొనుమిదె! |
| మెఱుపుదీగె మొగిలుతోడ మేలమాడు నట్లు చిరునవ్వుల న్నన్ను నలరజేసి ప్రాణములకన్న నీవె నా ప్రాణ మనుచు మురియుచుండగ నన్నింత మోసగింతె? |
| ఆకసముదాక బొంగెడు నాసలెన్నొ వనిత! నీ చెంత సఫలమ్ము బడయ నెంచి మురియుచుండగ నన్నింత మోసగించ న్యాయమౌనటె చెలియ అన్యాయముగదె? |
| పోనిలే, అంతదయ నీకు బుట్టకున్న కర్మమని యెంచి గడపెద కాలమెట్లొ ఎంచియొ యెంచకో ప్రేమ నించినాను బతికినను చచ్చినను నాదు ప్రాణ మీవె. |