| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 112. భక్తిమార్గము |
| 112. భక్తిమార్గము |
| వొద్దే యీ వేదాంతమూ వొద్దూ వొద్దంటే వినవే వొద్దే... |
| ఉన్నదేమో వుణ్ణేవున్నది లేనిదేమో లేనేలేదు ఉన్నదీ పొమ్మన్నాపోదూ లేనిదీ రమ్మన్నారాదూ వొద్దే... |
| చూడదగినా క్షేత్రా లున్నవి ఆడదగినా తీర్థా లున్నవి పాడదగినా పాటా లున్నవి వేడదగినా దేవుళ్ళున్నా రొద్దే... |
| జీవితము శాశ్వతము కాదూ భావరాజ్యము కంతూలేదూ యేవిధానా తుదనెగ్గేమో దేవుడూ నిర్మొహమాటంటా |
| వొద్దే యీ వేదాంతమూ వొద్దూ వొద్దంటే వినవె! |