| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 050. బిచ్చగాడు |
| 50. బిచ్చగాడు |
| త్రోవ గాన్పింపకున్నదో దేవ! కనులు మసక గ్రమ్మెడు నెమ్మది మాంద్యతమము గప్పుచున్నది, యింకెంత కాల మిట్టు లంధకారము లోకమ్ము నావరించు? |
| దించినట్టి మో మెత్తక, దేహి యంచు చేతులం జోలె గట్టుక, జీర్ణ వస్త్ర ములను దాలిచి ప్రణయ భాగ్యులను బిచ్చ మడుగ నొకరైన నొకపట్టె డిడరు దేవ! |
| జగతి ధర్మము శూన్యమై చచ్చెనొక్కొ! లేక నాకర్మఫల మొకో, ఈ కరణిని ఆకలి దహింప కరుణ నమ్మా యటన్న పలుకువారలు లేక చావంగనుంట? |
| అన్ని యాశలు వ్యర్థమ్ము లయ్యె తండ్రి? నీవు దక్క నాకింక దిక్కెవరు లేరు, నీ దయారమ్యరూపము నింక మరుగు పరుపబోకుము భక్తుని కరుణ గనుము. |