| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 049. పాటకుడు |
| 49. పాటకుడు |
| వీణె చేజారి పడిపోవు, వ్రేళ్ళు శ్రుతుల నింపుగా మీటి రాగ మొప్పింపకుండె, గొంతు బొంగురువోయెడు, నెంత చించు కొంచు బాడిన నీవు గాన్పించవేమి? |
| హాయిలో మున్గి మాయమై పోయినావొ? పరవశత జెంది భక్తుని మరచినావొ? దేవ, నా కింక నెపుడు నీ దివ్యదర్శ నమ్ము నిచ్చెదు? నా పాట కంత మెపుడు? |