| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 048. వృథాన్వేషణము |
| 48. వృథాన్వేషణము |
| విశ్వమం దెంతగాలించి వెదకిచూచి నా త్వదీయమయమ్ము కానట్టిచోటు కానిపించుటలేదు నా కన్నులకును వెఱ్ఱినై లేనిదానికే వెదకినానొ? |
| ఊహపై యూహ లల లట్టు లుబ్బియెగసి ఊతలూగించు నా లోలహృదయనౌక చెలియరో! తీరమన్నది చేరగలదొ? మునిగిపోవునో ప్రలయంపు ముంపులోన! |