| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 014. చాకలోళ్ళ గొప్ప |
| 14. చాకలోళ్ళ గొప్ప |
| ఎల్లా గెక్కూవా, ఇం కెల్లా గెక్కూవా? |
| సదువూకున్నా బ్యామ్మర్లంతా సాకలవోళ్ళా రాముడికంటె ఎల్లా గెక్కూవా? |
| పండాగనకా పబ్బామనకా వండనిబువ్వా వడకనిబట్టా సక్కదనాలా సాకలపుల్లీ కెక్కడమడితే అక్కడ దొరుకు ద్దెల్లా గెక్కూవా? |
| పిల్లాపెళ్ళీ చేసిన్నాడూ పెద్దాకాపూ డబ్బూలిత్తే కల్లూనీలూ తాగీనన్నీ కొల్లాగానూ దొరుకూతాయీ ఎల్లా గెక్కూవా? |
| చలవామడతా మొలకూ గట్టీ జలతార్రుమ్మాల్ తలకూ జుట్టీ యీదులయెంబడి వూరేగింపుతో ఇలాయి లట్టే రాముడుకంటే ఎల్లా గెక్కూవా? |
| జగతీలోపల కులాల్లోకీ సాకలవోళ్ళా కులమే గొప్పా, సాకలవోళ్ళా కులానికల్లా సక్కనిపుల్లీ రాముడె గొప్పా |
| ఎల్లా గెక్కూవా, ఇం కెల్లా గెక్కూవా? |