| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 015. మజా! |
| 15. మజా! |
| ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ... |
| కల్లూ తాగీనోళ్ళు కైలాస మెల్తారంట సారా తాగినోళ్ళు సర్గ మెల్తారంట! ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ... |
| కడుపూ సందరమైతె కాలవ సారాయైతె పడుతూ లేత్తూ తాగి బాగా కై పెక్కాలి ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా కల్లు దుకానాని కెల్లొద్దామా పుల్లీ... |