| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 005. చెవిటి మల్లయ్య పెళ్ళి |
| 05. చెవిటి మల్లయ్య పెళ్ళి (శ్రీశైలయాత్ర) |
| హృదయమా! సంద్రముకన్న పది పదింత లతివిశాలవు కమ్మ! దేవాధిదేవు డగు మహాదేవు కరుణామృతంపు వాహి నులను నీలోన కలుపుకోవలెను కాదె! |
| ఇది మహాదేవు సామ్రాజ్య మిచట నీకు నీతిబాధల భయ మించుకేని లేదు సకల శుభములు నొదవు నిస్సంశయమ్ము శివునిపే రశుభాలకు చెంపపెట్టు! |
| పవను డనుకూలుడౌ దప్పి వాపికొనగ కొండవాగులలో నీరు గ్రోలి తమిని ఇటు నటులు జూడకే కాలు దిటముగాను మెట్లపై నూని పైకెక్కు మృదులగాత్రి! |
| హరహరా, శంకరా, మల్లికార్జునుండ! చేదుకో, చెవిటి మల్లయ్య చేదుకొమ్మ టంచు, నుత్సాహమున పైకి నరుగుచుండ్రి తోడి యాత్రికు లరుగోనె తోయజాక్షి! |
| మూట నెత్తినబెట్టుకా మూడుకాళ్ళ ముసలిదే కర్ర బుచ్చుకు మోహరించి యెక్కుచుండగ చెప్పెడి దేమికలదు? పడుచు దంపతులము భయంపడగ దగునె? |
| పూలపాన్పులు బరచిన నేలపైన గాలు బెట్టినతోడనే కందిపోవు నవ్యనవనీతగాత్రి! నీ భవ్యమైన భక్తియే ఊతగాగొని పైకి జనుమ! |
| పెళ్ళివేడుక జూచిపో బిలిచె నన్ను చెవిటి మల్లయ్య, మాదె పైచేయి సుమ్ము పెళ్ళికూతురు భ్రమరాంబ పిలిచె నంచు పెంకితన మేలనే ఆడపెళ్ళిదాన! |
| ఈ మహాగహనాంతర సీమలోన నీవు శ్రీగిరిభ్రమరాంబ, వేను మల్లి కార్జునుడ, యాత్రికుల్ ప్రమథాదు లనుచు సరస మాడుకొనుచు పైకి జనుద మబల! |