| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 006. శివరాత్రి |
| 06. శివరాత్రి |
| పరమశివా యని నోట నిండుగా పల్కవేమిరా యీవేళయినా! కరుణామయు డతడే కష్టమ్ముల గట్టెక్కించునురా, ఓ పాపీ! |
| పావన గంగాస్నానము జేసుక పారదోలరా పాపము లన్నియు నీ విధినైనను పెరిగియున్న నీ యిహజన్మపాప మేగెడునేమో! |
| కొండకోనలో నల్లదె శివపూ జుండు పార్వతిని మది నిలుపుమురా దండికాంతు లిడు నామె దీపికలు తలగదోలురా నీ పాపతమము! |
| కరముల తాళాల్ కాళ్ళను గజ్జెలు కలిగి నాట్యము న్సలుపుమురా పరవశముగ శివతాండవ మాడుచు దురిత దూరమౌ నిద్దుర గనరా! |
| పరమశివా యని నోటనిండుగా పల్కవేమిరా యీవేళయినా! |