| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 007. గోపాలకృష్ణుడు |
| 07. గోపాలకృష్ణుడు |
| ఏమని పాడితివో గోపాలకృష్ణా ఏమని పాడితివో? భామలు పదియారువేలు పరవశులై సొక్కి సోల ॥నేమని॥ |
| బృందావన మా నందమయముగా ॥నేమని॥ |
| యమునా నదిలో నమృతము పొంగగ ॥నేమని॥ |
| వెన్నెల లెల్లెడ వెల్లివిరియగా ॥నేమని॥ |
| లోకము లన్నియు లోలాండగా నేమని పాడితివో గోపాలకృష్ణా ఏమని పాడితివో! |