| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 008. చంద్రగ్రహణము |
| 08. చంద్రగ్రహణము |
| రాబోకు రాబోకురా చందమామ! రాహువు పొంచున్నాడురా తోవలోన! |
| ఆ కొక్కటైనాను అల్లాడ కున్నాది మబ్బులపై నేదొ మాయ కప్పేసింది! ॥రాబోకు॥ |
| తెల్లన్ని నీ కాంతి నల్ల నయ్యేనురా! చల్లన్ని నీ మోము సన్నగిల్లేనురా! ॥రాబోకు॥ |
| పరమ రాకాసిరా పాపిష్టి రాహువు మిత్తిలా నిను బట్టి మింగబొయ్యేనురా! రాబోకు రాబోకురా చందమామ! రాహువు పొంచున్నాడురా తోవలోన! |