| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 009. హెచ్చరిక |
| 09. హెచ్చరిక |
| మంచిరోజు కాదోయి, చందమామా! మంచిదారి కాదోయి, చందమామా! |
| ఇంద్రధనసు విమానాన చందమామ! యెచటికంత తొందరగా బొయ్యేవోయ్ ముందు కీడు తెలియదేమొ? |
| మంచిరోజు కాదోయి, చందమామా! మంచిదారి కాదోయి, చందమామా! |
| కవిలా గున్నావు నీకు కానరాదొ కిందు మీదు? మిత్తిలా తమస్సు నిన్ను మింగి గుటక వేసేనోయ్ |
| మంచిరోజు కాదోయి, చందమామా! మంచిదారి కాదోయి, చందమామా! |