| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 010. యశోధరా విలాపము |
| 10. యశోధరా విలాపము |
| లేపనైనా లేపలేదే! మోము చూపనైనా చూపలేదే! |
| కోపకారణ మేమొ యేపాప మెరుగనే! ॥లేపనైనా॥ |
| హృదయ తల్పముపైన సొద మరచి హాయిగా నిదురదోగే నన్ను వదలి పోయేవేళ! ॥లేపనైనా॥ |
| మబ్బు కన్నెల కింత ఉబ్బితబ్బిబ్బేలో? ఆకాశమున కంత ఆనంద మెందుకో? ॥లేపనైనా॥ |
| మాధవీలత కింక మంటికౌగిలి యేన? మాపటింతల నింట దీప మిక వెలిగేన! ॥లేపనైనా॥ |
| ద్వారమా! నాథు డే దారిబడి పాయెనే? కన్నిబాబా! నీకు కలలైన రాలేద? |
| లేపనైనా లేపలేదే! మోము చూపనైనా చూపలేదే! |