| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 052. గొంతెమ కోరికలు |
| 52. గొంతెమ కోరికలు |
| కడవలతో ముంచి పారబోయం గలవె కడలి నీళ్ళన్నియు మాలీ? చేతుల దేకుచు హిమాలయాగ్రము జేరంగలవే కుంటి ముదుసలీ? |
| పైపై వలపుననే, ప్రియా, ప్రణయ పారావారము దాటంగలవే? కర్మలచేతనె యీశ్వరరూపము గాంచంగలవే ఛాందసోత్తమా? |