| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 053. గగన కుసుమములు |
| 53. గగన కుసుమములు |
| ఆకాశసుమముల నంద మౌనంచు పొలతి యాశాలతన్ బోషింతు వేలె? శ్రీకృష్ణుపద దివ్యసీమ శోభిల్లు బూజాసుమంబుల బూయింపరాదె? |
| పలురంగులను కన్ను లలరించునంచు నాశాదళమ్ముల గోసెదే లింతి? శీత విఫలవాత శాతాసి హతిని పలురంగులాకులు నిలువ వోబేల? |
| బంగారు చెండ్లటు రంగారు నంచు కాంక్షాఫలమ్ముల కాసింతె యింతి? క్రూరమృత్యు విషోరగోగ్రకీలలను అమృత ఫలమును విషమ్మయి పోవునేమొ! |