| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 054. ఆశాకిరణము |
| 54. ఆశాకిరణము |
| శుభ్రజ్యోత్స్నకు వన్నె గూర్చు నీ సోయగంబు గనువారే లేరే? |
| విభ్రాంతి గొల్పు నీ దివ్యప్రభ వీక్షించువారు లేరే కాంతా? |
| రాల్గరిగించెడు నీ ప్రేమరాగ మాలించువారె లేరే యింతీ? |
| కాలము నిరవధి పృథ్వి విపులమౌ జాలింబడియెద వేలే బేలా? |