| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 055. ఆదర్శము |
| 55. ఆదర్శము |
| ఆకసమున చిఱుమబ్బుల చాటున నడగి దాగుమూత లాడె దేలే? నీ కళ్యాణాకృతి శోభ తెలియ నిలచి తాండవము సేయవె మూర్తీ! |
| చినుకుచినుకులుగ తేనెతుంపురుల జిలుకుచు చవు లూరించెద వేలే? ఘనధారాపాతముగ నమృత మా కాశవాహినీ వర్షింపగదే |
| కూనురాగముల దీయు నన్నిటు కొనిపోయెదవే వింతసీమలకు? మానిని, యిచ్చట నొక్కింత నిలిచి మదిలోనిమాట జెప్పిపోగదే? |