| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 056. కాలగతి |
| 56. కాలగతి |
| సద్రత్నము హారమ్మున వ్రేలకె సంద్రమ్మడుగున నణగునె యకటా! మేలిపూవు చెలిజడలో నలరక గాలిని విచ్చుచు తావి వీడునే? |
| అడవిం గాసిన వెన్నెల యట్టుల పడతీ? నీ యందమ్ము వృథయౌనే? బూదింబోసిన పన్నీరట్టుల పొలతీ! నీ సరసత వమ్మౌనే? |