| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 057. అకాలకుసుమములు |
| 57. అకాలకుసుమములు |
| ఇప్పుడే తలజూపెద వేటికి ని న్నెవరు గాంతురో వెఱ్ఱిచంద్రుడా, ఎల్లెడ సూర్యుండు వెల్గుచుండ నీ చల్లదన మ్మేరికి కావలయున్? |
| కమ్మతావులను నేటికి నెల్లెడ జిమ్ముచుంటివే సంపగిపూవా, ఉమ్మరించు నీ వేళ నెవరు నీ కమ్మతావు లానందించేరే? |
| కుంకుమ పసువులు మోముపై పూసు కొందువేల పార్వతివలె సాధ్వీ సంకరయువతులు నీ దేదీప్యపు కుంకుమ తేజము మెచ్చెదరే? |
| కూ కూ యని తేనె లొల్క బాడుచు గుండెలు కరిగించెదేల పికమా, కాకు లెల్లెడల కావు కావు మన నీ కలకంఠము వినబడునే? |