| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 058. స్వయంకృతము |
| 58. స్వయంకృతము |
| ఆకాశముపై చూడ్కి నిగుడ్చుచు నదేపనిగ యోజింపకు మనసా? ఆకాశమ్మున నేమి గలదు నీ యనుభవమ్ము తప్పింపగ మనసా? |
| చల్లని వెన్నెల నుసురుసు రనుచును సంతాపముపడె దేటికె మనసా? ఎల్లజగమ్ముల నీ వెన్నెలయే చల్లదె ప్రేమ పరాగము మనసా? |
| సురనదిమెడ నూగు పద్మపతకము మురికి చెఱువులో వేతువె మనసా? సరసముగ బాడుకోకిలకు కాకి సావాస మెట్లు మేలౌను మనసా? |
| కమ్మతావులిడు రోజాదండను గన్నేరుపూవు గుత్తువె మనసా? అమృతమ్ములో విషము గలుపుకొని అంత తప్పదాగ నేలనే మనసా? |