| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 149. హితోపదేశము |
| 149. హితోపదేశము (ఎంకిపాటలు) |
| చాటొద్దా నీకు మాటొద్దా? చిన్నదానవు నీకు సిగ్గొద్దా? |
| ఆసీమ యీసీమ అంద రందాలు దిద్దంగ బిళ్ళేరి అద్దమౌతావా? చాటొద్దా ... |
| ముందు మన పాపణ్ణి కింద దిగనీక ఎత్తుకొని నలుగురూ వొత్తిపారెయరా చాటొద్దా ... |
| చిట్టి నువు దేవతై చేసేటి దేమే? రచ్చకె క్కొట్టినే రద్ది పదతావా? చాటొద్దా నీకు మాటొద్దా? చిన్నదానవు నీకు సిగ్గొద్దా? |