| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 150. కామాసుర |
| 150. కామాసుర |
| "జలజల మని పాఱెడు నీ సెలయేటిదరిం గూర్చుని విలపించెద వేల నిటుల చెలియ! చెప్పవే. |
| చిన్నవోయె ముద్దుమోము కన్నులంట నీరు గారు వన్నెతరిగి వాడె మేను కన్నె! యేలనే? |
| చెట్టు చామ నల్లబాఱె పిట్ట లన్ని గూళ్ళ కేగు చుట్టు నెల్లయెడలను చీ కట్లు గ్రమ్మెడున్." |
| "మొన్న తోట గంటి నొక్క వన్నెకాని కామరూపు కన్నుమణగుకాంతి, వాలు గన్నులవానిన్. |
| తల కొక పూదండయు, చే తులకు కంకణములు దెచ్చి వలపు కలిగినటుల మెల్ల కిలకిల కులికెన్. |
| ఎక్కించెను తేజీపై నొక్కటైన గాంచనతడు పక్క కొఱిగి యీల వేసి చక్కగ బాడ\న్. |
| మలగుపండ్లు గుడువ నిచ్చి పలవదేనె మంచుపాలు, తెలియనట్టి బాస జెప్పె 'వలతు ని' న్నని. |
| సెలయేటికి దెచ్చి నన్ను వలవల బెగ్గిలి కలుగుచు వలపున నాకన్నుల ము ద్దుల నాల్గు గొనెన్. |
| మెలమెల్లన్ జో కొట్టన్ కలగంటిని - హా! ఘోరము! విలయపుకల గంటిని యీ సెలయేటిదరిన్. |
| వెల్లబోవు రాకొమరులు తెల్లవోయి చచ్చినట్టు లెల్ల రనిరి 'కామాసుర' పిల్లను బట్టెన్" |
| వెలవెల బోవుచు కీడున్ దెలిపె వారి పెదవు లెల్ల మెలకువయ్యె, పడియుంటిని సెలయేటిదరిన్. |
| జలజల మని పారెడు నీ సెలయేటిదరిన్ గూర్చుని విలపింపగ కారణముం దెలియు మియ్యదే. |