| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 151. అప్పచెల్లెళ్ళు |
| 151. అప్పచెల్లెళ్ళు (రవీంద్రుని "తోటమాలి" నుండి) |
| నీళ్ళకోస మప్ప చె ల్లెళ్ళు పోదు రీ దారినె పువ్వుబోం డ్లిచటి కొచ్చి నవ్వుకొందు రేలనో? |
| చెలులు నీళ్ళ కేగునపుడు చెట్లచాటు నక్కిచూచు సరసు డున్న సంగతి వా రెఱుగుదు రేమో నీళ్ళ ... |
| ఈదారిని బోవునప్పు డేదో గుసగుసలాడెద రిద్దరు నా సరసుని గు ట్టెరుగుదురేమో! నీళ్ళ ... |
| సుందరు లిట కొచ్చినంత బిందె లిటులు నటు లొరుగుచు చిందిపోవు లోని నీ ళ్ళెందుచేతనో? |
| చెలులు నీళ్ళకేగునపుడు చెట్లచాటు నక్కి చూచు పురుషు గుండెతల్లడి వా రెఱుగుదురేమో? నీళ్ళ ... |
| సకియ లిచటి కొచ్చినంత నొకరిమొగము లొకరు చూచి కులుకుచు చిరునవ్వు నవ్వు కొందు రేలనో? |
| చెక చెకమని నడచెడు నా చెలుల నడకలోని నవ్వు చెట్లచాటున నున్న పురుషుచిత్తమును కలంచుగాదె |
| నీళ్ళకోస మప్ప చె ల్లెళ్ళు పోదు రీ దారినె |