| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 152. మేలిముసుగు |
| 152. మేలిముసుగు (జేబున్నీసా) |
| *జేబున్నీసా, ఫారశీ రచయిత్రి |
| మేలిముసుంగు నే మీదికి దీయ నే మేమి జరుగునో యె ట్లెఱుంగుదుము? పికిలిపిట్టయు గులాబీపూవు మరచు భక్తితో లక్ష్మిలావణ్యమ్ము గొలుచు బ్రాహ్మణుం డా దేవి వదలి నా మోము జూచు నాచెలువున జొక్కెడునేమొ? |
| కన్నులకేరికి గానరాకుండ పొదరింటిలో బలె పుష్పగర్భమున దాగియుండెడు సుగంధంబును బోలి మద్రచిత్రమ్ములౌ పద్యాలనడగి యున్న నామోము గాంతురుగాక జనులు మేలిముసుంగు నే నేల దీయవలె? |