| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 035. జీవయాత్ర |
| 35. జీవయాత్ర |
| జగతి నెల్లెడ వీచి చల్లనిచెట్ల లలితమ్ములైన పల్లవములన్ పూల సంచలింపగజేయు చల్లగాలివలె తీరనికోర్కెతో తిరుగుదు కృష్ణ! |
| విశ్రాంతి యెరుగక వేదన స్రుక్కు నాలోచనాయత్తమౌ మదితోడ మాధవా! నీదుగుమ్మము జేరువరకు నీ జీవయాత్ర నెగ్గించెదనోయి! |