| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 036. వసంతాగమము |
| 36. వసంతాగమము |
| గున్నమావి తోటలోన గువ్వయొకటి గూడు కట్టి సరసుడౌ వసంతురాక కొఱకు తమిని వేచియుండె. |
| కాని నామనమ్ము మిగుల కలచుచు హృదయమ్ములోన మరగువలపు తలపు నెవ్వ రెఱిగింతురు నీకు కృష్ణ! |
| పగ లెల్లను ధాత్రీరమ పచ్చనిపుట్టమ్ముగట్టి పసుపుపూల దాల్చి బాల పవను గూడి తిరుగుచుండ |
| చల్లనైన చెట్టునీడ నుల్ల మరల గూరుచుండి వనము కవల బారుసోన పాటలు వినుచుందు కృష్ణ! |