| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 046. జీవయాత్ర |
| 46. జీవయాత్ర |
| ఈ మహాసముద్రమ్ములో నెన్ని యెన్ని తీరముల జేరవలయునో క్రూరమౌ తు పాను లెన్నెన్ని గడపగావలెనొ బేల! ఇల్లలకగానె పండగా యేమె చెపుమ? |
| నమ్మదగ్గదికాదు సంద్రమ్ము తీరు పడవ వోటిది తిన్నగా గడపగల్గు నావికుడు వోయె చుక్కాని నీవె చేత బూని నెగ్గింపు మీయాత్ర! పైన లేడె? |