| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 045. అవస్థాభేదము |
| 45. అవస్థాభేదము |
| లేమావిగుళ్ళ మెక్కెడు పికమా లేకితిండి నీ కేలనే? |
| పూవుల జాడల బోయెడు హరిణీ ముండ్లడొంక బో నేటికో? |
| సురనది జలముల తూగెడు హంసీ మురికి చెఱువు జొరె దేలనే? |
| ఇంగిత మెరిగిన మనమా నీకీ యెంగిలి యోజన యెట్టిదే? |